![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -540 లో..... వేదవతి అందరు టిఫిన్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే ప్రేమ దగ్గర నుంచి నర్మద వస్తుంది. ప్రేమ ఏమంది అని వేదవతి అడుగుతుంది. మీలాగే మీ మేనకోడలు కూడా మొండి అని నర్మద అంటుంది. మావయ్య టిఫిన్ చెయ్యడానికి రండీ అని వల్లి పిలుస్తుంది. లేదమ్మా నాకు బయట నుంచి వస్తుందని రామరాజు అంటాడు.
అప్పుడే తిరుపతి బయట నుంచి టిఫిన్స్ తీసుకొని వస్తాడు. అమూల్య, నర్మద కూడా అవే టిఫిన్ తింటూ బాగున్నాయని అంటారు. దాంతో ఏంటే పార్టీ మార్చారు అని వేదవతి అంటుంది. రోజు మీ టిఫిన్ తిని బోర్ కొట్టిందని నర్మద అంటుంది. నాన్న మీరు అమ్మని క్షమించండి అని ధీరజ్ అంటాడు. అప్పుడే అటుగా సాగర్ వెళ్తూ మోసం చేసినందుకు నాన్న ఈ విషయం లో కరెక్ట్ గానే ఉన్నాడని అంటాడు. తిట్టి బాధపెట్టిన వాడివి భార్యని కాపురానికి తీసుకొని వచ్చే బాధ్యత నీదే.. అది కూడా నీకు చెప్పాలా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ లోపలికి వెళ్తుంటే ధీరజ్ షర్ట్ గాలికి తన వైపు వస్తుంది. అది తీసుకొని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. మళ్ళీ కోపం తెచ్చుకొని ధీరజ్ మొహంపై విసిరేస్తుంది. అప్పుడే ధీరజ్ కి ఇన్ స్టిట్యూట్ నుంచి ఫోన్ వస్తుంది. మీ భార్య ఈ రోజు రాలేదు.. స్పెషల్ క్లాస్ ఉందని రమ్మని చెప్తాడు.
ధీరజ్ ఇండైరెక్ట్ గా తిరుపతితో మాట్లాడతాడు. ఒక మాటపై స్థిరత్వం ఉండదు.. గోల్ అన్నారు అది అన్నారని ఇది అన్నారని ప్రేమని ధీరజ్ రెచ్చగొడుతాడు. అప్పడే భద్రవతి, సేనాపతి వస్తారు. అత్త నేను కోచింగ్ కి వెళ్తాను. ఎందుకు వాడి సపోర్ట్ లేకుండానే పోలీస్ అవుతానని ప్రేమ అనగానే భద్రవతి సరే అంటుంది. మరొకవైపు అమూల్య కోసం విశ్వ వెయిట్ చేస్తాడు. అమూల్యతో మాట్లాడి ప్రేమ , ధీరజ్ లని కలపాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యతో మాట్లాడాలని విశ్వ ట్రై చేస్తే అమూల్య కోప్పడుతుంది. అప్పుడే సాగర్ వచ్చి నా చెల్లి వెంటపడొద్దని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
`
![]() |
![]() |